![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం సాదాసీదాగా సాగింది. ఎప్పుడు అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారో అంతా తారుమారు అయింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు ఇమ్మాన్యుయల్, తనూజ కలిసి స్కిట్ చేసేవారు. అలా ఏ స్కిట్ చెయ్యడానికి అయిన వీళ్ళే పెయిర్ గా ఉండేది.. వాళ్లు ఏం చేసిన ఆ స్కిట్ హిట్ అయ్యేది.. కానీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక అసలు కంటెస్టెంట్స్ అందరు చేంజ్ అయ్యారు.
ఇమ్ము ముందు నుండి ఉన్న కంటెస్టెంట్స్ తో కాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయి వాళ్ళతోనే ఉంటున్నాడు. తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో ఇమ్ము 'అపరిచితుడు' సినిమాలోని సీన్లని స్పూఫ్ చేశారు. అందులో రమ్య, ఇమ్మాన్యుయల్ ఇద్దరు చేశారు. రాము, నందిని రెండు క్యారెక్టర్స్ ని ఇమ్మాన్యుయల్, రమ్య ఇన్వాల్వ్ అయ్యి చేశారు. వీళ్లంతా స్కిట్ చేస్తుంటే తనూజ కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. స్కిట్ అంతా అయ్యాక నందిని నువ్వు నన్ను ఒప్పుకున్నావు కదా నాకొక కిస్ ఇవ్వమని రాము(ఇమ్మాన్యుయల్) అడుగుతాడు.
దాంతో రాము క్యారెక్టర్ లో ఉన్న ఇమ్ము కళ్ళు మూసుకోగా కళ్యాణ్ వచ్చి ఇమ్ము చెంపపై ముద్దిస్తాడు. అది నందిని క్యారెక్టర్ లో ఉన్న రమ్య ఇచ్చిందని ఇమ్ము అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. హౌస్ లో ఇంతవరకు ఇమ్ము, తనూజల కాంబినేషన్ సూపర్ హిట్టు కానీ ఇమ్ము అలా రమ్యతో స్కిట్ చెయ్యడం ఏం బాలేదని తనూజ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
![]() |
![]() |